Champions Trophy in Dubai: దుబాయ్లో భారత్ మ్యాచ్లు.. 11 d ago
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లు దుబాయ్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. యూఏఈ క్రికెట్ బోర్డుకు చెందిన షేక్ నహ్యాన్ అల్ ముబారక్తో ఆదివారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మోహిసిన్ నఖ్వి చర్చలు జరిపారు. ఇందులో తటస్థ వేదికగా దుబాయ్ వైపు పీసీబీ మొగ్గుచూపినట్లు తెలిసింది. హైబ్రిడ్ మోడల్లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్లో కాకుండా తటస్థ వేదికపై మ్యాచ్లు ఆడనుంది. ఒకవేళ భారత్ నాకౌట్కు అర్హత సాధిస్తే, యూఏఈలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి.